/CartoonistHariKrishna

Testimonials

XXXXXXXXX

బన్ను

గోతెలుగు.కామ్

హరికృష్ణ కార్టూన్లకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అతనికి ఒక ప్రత్యేక శైలి ఉంది. గీసిన ప్రతి కార్టున్ కి ఒక అర్థం ఉంటుంది. నవ్వు పుట్టిస్తుంది. ముఖ్యంగా మూస కార్టూన్లు వేయడు. తెలుగులో 500కు పైగా కార్టూనిస్టులున్నా, ఓ 50 మంది కార్టూనిస్టుల కార్టూన్లనే సంతకం మూసేసి ఎవరి కార్టూన్లో చెప్పగలము. అందులో హరికృష్ణ ఒకరు. నేను వ్యక్తిగతంగా అతన్ని రెండు మూడు సార్లు కలిశాను. గోదావరి జిల్లా వెటకారం అతని మాటల్లోనూ, కార్టూన్ల లోను కనిపిస్తుంటుంది. హరికృష్ణ మరిన్ని మంచి కార్టూన్లు గీయాలి అని మనస్పూర్తిగా ఆశిస్తూ

XXXXXXXXX

Rama Reddy Karri

Director & Consultant Psychiatrist at Manasa Hospital-Rajahmundry

I've had the opportunity to view Hari Krishna's work, and I found it to be both entertaining and thought-provoking. His cartoons demonstrate a unique ability to capture the essence of his subjects with humor and insight. I appreciate his professionalism and dedication to his craft, and I believe he has a promising future ahead in the world of cartoons and animation.

XXXXXXXXX

Divakara Babu Madabhushi

Dialogue writer,Telugu cinema industry

కార్టూన్ లు రచించడం అంటే రెండు చక్రాల సైకిల్ తొక్కడం లాంటిది.. సైకిల్ బ్యాలెన్స్ తప్పితే కింద పడతాం.. అలాగే కార్టూన్ నవ్వించలేక పోతే నవ్వుల పాలవుతాడు కార్టూనిస్టు! కనుక నవ్విస్తూనే ఉండాలి. ఒక చేతిలో కలమూ, ఒక చేతిలో కుంచె ధరించిన సవ్యసాచి కార్టూనిస్టు! కలమూ, కుంచె బ్యాలెన్స్ ఎప్పుడూ కోలుపోకుండా, నవ్విస్తూ, చురకలు వేస్తున్న మన కార్టూనిస్టు హరికృష్ణ గారు ఆయన ఇంకా ఎన్నెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.!

XXXXXXXXX

Ratnaji Nealapuri

Poet

నవ్వు రప్పించడమంటే మామూలు విషయం కాదు. ఒక హాస్య నటుడి డైలాగ్ డెలివరీ నుంచి, లేదా చమత్కారం వదిలితే చటుక్కున నవ్వు రాదు. దానికి బలమైన హాస్యపూరితం మాటలు అవసరం, సహజంగా ఉండాలి. ఇది కార్టూన్‌కి కూడా వర్తిస్తుంది. ఇక్కడ కార్టూనిస్ట్ ద్విపాత్రాభినయం చేయాలి. తాను ఎంచుకున్న దృశ్యానికి హావభావాలు పలికించి, చెప్పదలిచిన విషయాన్ని సరిపడా క్యాప్షన్‌ రాయాలి. ఈ రెండూ పుష్కలంగా తనలో ఇముడ్చుకున్న కార్టూనిస్ట్ హరిక్రిష్ణ. తన సొంత శైలితో సునిశితమైన హాస్యాన్ని జోడించి పాఠకుణ్ణి నవ్వించగల శక్తిమంతుడు హరికృష్ణ. ఆయన కార్టూన్లు చూసిన వారెవరికైనా ఈ విషయం ఇట్టే అర్ధమవుతుంది.